కిటకిటలాడిన కురుమతి కొండలు
● అమావాస్య సందర్భంగా భారీగాతరలివచ్చిన భక్తులు
చిన్నచింతకుంట: అమావాస్యను పురస్కరించుకొని అమ్మాపురం కురుమూర్తిస్వామి ఆలయానికి శుక్రవారం భక్తులు భారీగా తరలివచ్చారు. అర్చకులు తెల్లవారుజామునే ఆలయాన్ని శుద్ధిచేసి సుప్రభాత సేవ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు క్యూలైన్‌లో నిల్చుని స్వామివారిని దర్శించుకున్నారు. కొందరు భక్తులు మెట్లపై దీపాలు వెలిగిస్తూ, కొబ్బరికాయలు కొడుతూ గోవింద నామస్మరణతో స్వామివారి చెంతకు చేరుకోగా.. మరికొందరు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పలువురు కొండ దిగువన మట్టికుండలో పచ్చిపులుసు, అన్నం వండి నైవేద్యంగా స్వామివారికి సమర్పించారు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, ఈఓ మదనేశ్వర్‌రెడ్డి, కమిటీ సభ్యులు బాదం వెంకటేశ్వర్లు, భాస్కరాచారి, భారతి తగిన ఏర్పాట్లు చేశారు.
ఘనంగా గిరి ప్రదక్షిణ..
కురుమూర్తిస్వామి ఆలయం వద్ద శుక్రవారం గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారి రాజగోపురం ప్రధాన మెట్ల నుంచి స్వామివారి ప్రధాన ఆలయం పక్కన ఉన్న కలశ పూజ మండపం మట్టి రోడ్డు, అమ్మాపురం మీదుగా ఐదు కిలోమీటర్ల మేర ఆలయం వరకు ప్రదక్షిణ చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కిటకిటలాడిన కురుమతి కొండలు
Comments
Please login to add a commentAdd a comment