పోలీస్ శాఖలో ఏఆర్ సిబ్బంది అత్యంత కీలకం
మహబూబ్‌నగర్ క్రైం: పోలీస్ శాఖలో ఏఆర్ పోలీసుల విధులు అత్యంత కీలకమని, శాంతిభద్రతల పరిరక్షణ కోసం 24 గంటలు పనిచేస్తారని ఎస్పీ జానకి అన్నారు. జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీస్ (ఏఆర్) మొబిలైజేషన్ ముగింపు కార్యాక్రమం శుక్రవారం జిల్లా పరేడ్ మైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీకి ప్రత్యేక కవాతు నిర్వహించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కుటుంబాలను వదిలి, ప్రజల భద్రత కోసం ఎంతో కష్టపడుతారని తెలిపారు. అన్ని సవాళ్లను అధిగమించి పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వహించడం అభినందనీయన్నారు. శారీరక దృఢత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి నిత్యం వ్యాయామం, యోగా, మెడిటేషన్ చేయాలని, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి కుటుంబ సభ్యులతో సమయం గడపాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీలు రాములు, సురేష్‌కుమార్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్‌ఐలు కృష్ణయ్య, నగేష్, రవి తదితరులు పాల్గొన్నారు.
● ఏఆర్ ఎస్‌ఐగా పనిచేసి పదవి వీరమణ పొందిన అసదుల్లాను ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డి.జానకి పూలమాల, శాలువతో ఘనంగా సన్మానించారు. అలాగే ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ వెంకటేష్ కుటుంబానికి అతని బ్యాచ్ మిత్రులు ఆర్థిక సహాయం అందించారు. వెంకటేష్ బ్యాచ్ ఏఆర్ కానిస్టేబుళ్లు అందరూ కలిసి రూ.లక్ష ఎస్పీ చేతులమీదుగా ఏఆర్ కానిస్టేబుల్ భార్య వనితకు చెక్కు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment