అమరచింత: అక్రమంగా తరలిస్తున్న 5 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు ఎస్‌ఐ సురేష్ తెలిపారు. పట్టణంలోని శ్రీకృష్ణానగర్‌లో గల కాళికాలయం సమీపంలో అక్రమంగా ఓ వాహనంలో రేషన్ బియ్యం తరలిస్తున్నారనే సమాచారంతో శుక్రవారం రేషన్ బియ్యం కలిగిన వాహనంను అదుపులోకి తీసుకున్నామన్నారు. పట్టణానికి చెందిన సాకలి కోరి కృష్ణ అనే వ్యక్తి కొన్నేళ్లుగా అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నాడన్నారు. ఇదే తరహాలో ఐదు టన్నుల రేషన్ బియ్యాన్ని డంప్ చేసి వాహనంలో తరలిస్తూ పట్టుబడినట్లు వెల్లడించారు. వాహనంలోని 101 బియ్యం బస్తాలను సీజ్ చేసి డీఎస్‌ఓకు సమాచారం అందించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment