పురుగుమందు తాగి వ్యక్తి బలవన్మరణం
మల్దకల్ : నెల రోజుల క్రితం భార్య అనారోగ్యంతో మృతి చెందగా ఆర్థిక ఇబ్బందులతో పురుగుమందు తాగి భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో తల్లిదండ్రులను కోల్పోయి ముగ్గురు చిన్నారులు అనాథలుగా మారిన ఘటన శుక్రవారం చర్లగార్లపాడులో చోటుచేసుకుంది. ఎస్‌ఐ నందికర్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కుమ్మరి వీరేష్(32) భార్య భారతి జనవరిలో అనారోగ్యంతో మృతి చెందింది. ఆర్థిక సమస్యలతో మనస్తాపం చెందిన వీరేష్ గురువారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రించిన అనంతరం ఇంట్లో పొలాలకు పిచికారీ చేసే పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో ఉండగా వీరేష్‌ను చికిత్స నిమిత్తం గద్వాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ శుక్రవారం తెల్లవారు జామున మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. నెల రోజుల వ్యవధిలోనే తల్లి అనారోగ్యంతో, తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో ముగ్గురు పిల్లలు అనాథలుగా మిగిలారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఇటీవల అనారోగ్యంతో భార్య మృతి
అనాథలైన ముగ్గురు చిన్నారులు
పురుగుమందు తాగి వ్యక్తి బలవన్మరణం
Comments
Please login to add a commentAdd a comment