ఎండు మిరపకు నిప్పు పెట్టిన దుండగులు
● రూ. ఐదు లక్షల నష్టం
అయిజ: రైతులు పండించిన ఎండు మిరుప పంటకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటన గురువారం రాత్రి అయిజ మండలంలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలు.. తూంకుంట గ్రామానికి చెందిన రైతు అలిపీర 2.30ఎకరాల పొలంలో మిరుప సాగుచేశాడు. సుమారు 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పండించిన మిరుపను పొలంలోనే ఎండబెట్టి రాశిగా కుప్ప పేర్చాడు. గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఎండుమిరుప కుప్పకు నిప్పంటించారు. దీంతో సుమారు రూ. ఐదు లక్షల నష్టం వాటిల్లింది. శుక్రవారం బాధితుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ శ్రీనివాసరావు ఘటనాస్థలికి చేరుకొని పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment