కోనేరులో మృతిచెందిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులతో పాటు వివిధ సంఘాల నాయకులు మృతదేహంతో మూడు గంటలపాటు నిరసన తెలిపారు. బాధిత కుటుంబానికి రూ.కోటి ఇవ్వాలని, ఒకరికి ఉద్యోగం, మూడెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ యాదగిరి సంఘటన స్థలానికి చేరుకొని బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎంతకీ వారు వినకపోవడంతో ఎమ్మెల్యే కసిరెడ్డితో ఫోన్ ద్వారా బాధిత కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చూస్తామని హామీ ఇప్పించినట్లు సమాచారం. తక్షణసాయం కింద రూ.60వేలను కుటుంబ సభ్యులకు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment