హైవేపై రోడ్డు ప్రమాదం
ఒకరి దుర్మరణం..
కొత్తకోట: పెబ్బేరు సమీపంలోని రంగాపూర్ బైపాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరో 30 మందికి గాయాలైనట్లు ఎస్‌ఐ హరిప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు.. పెబ్బేరుకు చెందిన ముష్టి విష్ణు (35) భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి శుక్రవారం కారులో ఎర్రవల్లికి వెళ్లాడు. అక్కడ ఓ స్నేహితుడిని ఎక్కించుకొని తిరిగి హైదరాబాద్ బయలుదేరాడు. మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ ముస్లిం కుటుంబం కర్నూలు జిల్లా ఆత్మకూరులో బంధువులు మృతిచెందడంతో అక్కడికి వెళ్లి అంత్యక్రియలు ముగించుకొని తిరిగి స్వగ్రామానికి కారులో బయలుదేరారు. రెండు కార్లు పెబ్బేరు సమీపంలోని రంగాపూర్ బైపాస్ వద్దకు రాగానే ఒకదానిని ఒకటి దాటబోయి డివైడర్‌ను ఢీకొని రహదారి అవతలికి వెళ్లాయి. ఈ ప్రమాదంలో విష్ణు అక్కడికక్కడే మృతిచెందగా కుమారుడి కాలు విరిగింది. భార్యకు తీవ్ర గాయాలుకాగా, కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. మరో కారులో ఉన్న ముస్లిం కుటుంబంలో నలుగురికి తీవ్ర గాయాలు, నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో హైదరాబాద్ వనస్థలిపురం నుంచి తిరుపతి వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో బస్సులో ఉన్న 30 మందికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సులోని వారు ఆదివారం తిరుపతిలో జరిగే వివాహానికి హాజరుకావాల్సి ఉంది. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న హైవే సిబ్బంది, పోలీసులు క్షతగాత్రులను 108 వాహనంలో వనపర్తి ఏరియా ఆస్పత్రికి అటు నుంచి పలువురిని మహబూబ్‌నగర్, మరికొందరిని హైదరాబాద్‌కు తరలించారు. మృతదేహాన్ని వనపర్తి మార్చురీకి తరలించారు. ప్రమాద ఘటనతో జాతీయ రహదారిపై గంటల తరబడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎస్‌ఐ రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాలను పక్కకు తొలగించి రాకపోకలు పునరుద్ధరించారు.
హైవేపై రోడ్డు ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment