కొనసాగుతున్న శివరాత్రి ఉత్సవాలు
అలంపూర్: అలంపూర్ క్షేత్రంలో మహా శివరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం నాలుగోరోజు స్వామి, అమ్మవార్ల ఆలయాల్లో నిత్యపూజ, హోమాలు, బలిహరణం, రుద్రహోమాలు చేశారు. అనవాయితీగా ఉదయం స్వామి, అమ్మవారికి రావణ వాహన సేవ నిర్వహించారు. అర్చకులు స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను రావణ వాహనంపై ఉంచి పూజలు చేసి హారతులిచ్చారు. ఈఓ పురేందర్‌కుమార్ సేవ ప్రారంభించి పుర వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. సాయంత్రం అశ్వవాహన సేవ, పార్వేట సేవలు కొనసాగాయి. ఈ సందర్భంగా భక్తులు తమ ముంగిటకు వచ్చిన ఆది దంపతులకు స్వాగతం పలికి మొక్కులు తీర్చుకున్నారు.
నేటితో ముగియనున్న ఉత్సవాలు..
ఫిబ్రవరి 25న ప్రారంభమైన ఉత్సవాలు శనివారంతో ముగియనున్నట్లు ఆలయ ఈఓ పురేందర్‌కుమార్, చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. ముగింపు రోజున ఉదయం 7.30 నుంచి నిత్య పూజలు, హోమాలు, బలిహరణం, 9 గంటలకు శేషవాహనసేవ, 10 గంటలకు రుద్రహోమాలు, 11 గంటలకు పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, అవభృత స్నానం, మూకబలి, ధ్వజావరోహణం కార్యక్రమాలు జరగనున్నట్లు వివరించారు.
కనులపండువగా ఆదిదంపతుల రావణ, అశ్వవాహన, పార్వేట సేవలు
Comments
Please login to add a commentAdd a comment