సమగ్ర శిక్ష నిధులను వినియోగించుకోవాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): సమగ్ర శిక్ష ప్రాజెక్టు, పీఎంశ్రీ ద్వారా జిల్లాలోని పాఠశాలలకు మంజూరైన నిధులను వినియోగించుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోనీ వీసీ హాల్‌లో సమగ్ర శిక్ష ప్రాజెక్టు, పీఎంశ్రీ ద్వారా మంజూరైన నిధుల వినియోగం, ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు విద్యార్థుల సన్నద్ధం, తదితర విషయాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమగ్ర శిక్ష ప్రాజెక్ట్, పీఎంశ్రీ ద్వారా 2024–25 సంవత్సరానికి పాఠశాల నిర్వహణ, భద్రత, ఆత్మ రక్షణ, యువ, పర్యావరణ క్లబ్‌లు, నిర్మాణ పనుల కోసం మంజూరైన నిధులను వినియోగించుకోవాలన్నారు. టెన్త్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసేలా విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ నిర్వహించాలన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతగా అందించాలని సూచించారు. పాఠశాలల కిచెన్ షెడ్‌లు, పరిసరాలు పరిశుభ్రతగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేసవికాలంలో తాగునీటి కొరత లేకుండా, టాయిలెట్స్ ఉపయోగం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డీఈఓ ప్రవీణ్‌కుమార్, కేజీబీవీ ఏఎంఓ శ్రీనివాస్, పరీక్ష విభాగం అసిస్టెంట్ కమిషనర్ కరుణాకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment