ఉన్నత లక్ష్యం వైపు అడుగులు వేయాలి
మహబూబ్‌నగర్ క్రైం: బాలికలు జీవితంలో ఉన్నత లక్ష్యం ఏర్పాటు చేసుకుని ఆ దిశగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని ఎస్పీ డి.జానకి అన్నారు. మండలపరిధిలోని రాంరెడ్డిగూడెంలో ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కళాశాల(బాలికల)లో శనివారం నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలకు ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదట కళాశాల ఆవరణలో మొక్క నాటిన ఆమె, అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కొన్ని బలహీనతలు జీవితాన్ని, లక్ష్యాన్ని తారుమారు చేస్తాయని అలాంటి వాటికి ఆకర్షితులు కావొద్దన్నారు. సమాజంలో మహిళ పాత్ర చాలా గొప్పగా ఉంటుందని, ప్రతి రంగంలో రాణించడానికి కష్టపడాలన్నారు. కార్యక్రమంలో వన్‌టౌన్ సీఐ అప్పయ్య పాల్గొన్నారు.
ఉన్నత లక్ష్యం వైపు అడుగులు వేయాలి
Comments
Please login to add a commentAdd a comment