‘యూపీఎస్’తో ఉద్యోగులను మభ్యపెట్టే ప్రయత్నం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ పేరుతో ఉద్యోగులను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తుందని సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రకాంత్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోనీ సీపీఎస్ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీఎస్ విధానానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.50లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఏళ్లతరబడి పోరాటం చేస్తున్నారన్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి అమలుచేయనున్న యూపీఎస్ విధానంతో ఉద్యోగుల జీవితాలు దుర్భరంగా మారుతాయని ఆవేదన వ్యక్తంచేశారు. యూపీఎస్‌ను రద్దు చేయాలనే డిమాండ్‌తో ఈనెల 2న హైదరాబాద్‌లో ‘యుద్ధభేరి’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కలెక్టరేట్‌లో విడుదల చేశారు. ఆదివారం ఉదయం జెడ్పీ గ్రౌండ్ నుంచి ‘యుద్ధభేరి’కి బయలు దేరనున్నట్లు తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేష్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు రాజేష్ కుమార్, సీపీఎస్ ఉద్యోగులు శ్రీనివాస్ రెడ్డి, నర్సింహారెడ్డి, ఆంజనేయులు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా
ప్రధాన కార్యదర్శి చంద్రకాంత్
Comments
Please login to add a commentAdd a comment