సీసీ రోడ్లు, డ్రెయినేజీ నిర్మించాలి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: స్థానిక భాగ్యనగర్ కాలనీలోని రోడ్ నం.9లో సీసీ రోడ్లు, డ్రెయినేజీ నిర్మించాలని కాలనీవాసులు కోరారు. ఈ మేరకు వారు శనివారం కలెక్టరేట్‌లో మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధిరి శివేంద్రప్రతాప్, కమిషనర్ డి.మహేశ్వర్‌రెడ్డిని వేర్వేరుగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీ సంక్షేమ కమిటీ మాజీ అధ్యక్షుడు ఆశన్న, మాజీ ప్రధాన కార్యదర్శి చికిరాల పట్టాభి మాట్లాడారు. సుమారు 20 ఏళ్లుగా నివసిస్తున్నా తమ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విన్నవించారు.
అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు
కోయిల్‌కొండ: రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించేందుకు చర్యలు చేపడుతుందని ఎంపీడీఓ హరిశ్చంద్రారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని అయ్యవారిపల్లి గ్రామం ఫైలట్ ప్రాజెక్టుగా ఎంపికై న సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లపై లబ్ధిదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇంటి నిర్మాణంలో పాటించవలసిన నాణ్యతను లబ్ధిదారులకు వివరించారు. కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వైద్యం భాస్కర్, ఎండీ పుష్పలత, మోహన్‌రెడ్డి, సంధ్యరాజేందర్, రాజన్న, చంద్రనాయక్, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment