‘ఉపాధి‘లో నీడ కరువాయె
నవాబుపేట: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడుతోంది. ‘ఉపాధిశ్రీలో పని చేసే కూలీకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా అవి అమలుకు నోచుకోవడం లేదు. ఎండాకాలంలో వారు సేద తీరేందుకు పని ప్రాంతాల్లో ఏర్పాట్లు చేయాల్సి ఉంది. కానీ ఎక్కడా కూడా ‘ఉపాధి‘ కూలీలకు నీడ కోసం ఏర్పాట్లు చేసిన దాఖలు లేవు. అలాగే తాగునీరు, మెడికల్ కిట్లు సైతం అందుబాటులో ఉంచాల్సి వాటి ఊసే లేదు. పని ప్రాంతంలో ఏదైనా జరిగితే ఊర్లోకి కానీ, మండల కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి. ముఖ్యంగా గ్రామాల్లో కందకాల తవ్వకం కొనసాగుతున్న తరుణంలో పనిచేసే స్థలం గ్రామాలకు చాలా దూరంగా ఉంది. దీంతో కూలీలకు సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది.
మండుటెండలో పనిచేస్తున్నాం
మండుటెండలో పనిచేస్తున్నాం. కాస్త సేద తీరేందుకు నీడ కరువైంది. మూడేళ్ల క్రితం టెంట్ కవర్లు ఇచ్చారు. కానీ వాటి జాడలేదు. తాజాగా ఫాంఫండ్ పనులు చేస్తున్నాం. పనికి దాదాపుగా రెండు కిలోమీటర్ల దూరం వస్తాం. ఎండలో తిరిగి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నాం. – బాబునాయక్, హాజిలాపూర్
పంచాయతీలే సమకూర్చాలి
మూడేళ్ల నుంచి కొత్త పనిముట్లు రాలే. వాటికి సంబంధించి కూలీలకే డబ్బులు అదనంగా వస్తాయి. వేసవిలో కూలీలకు ఎండ నుంచి ఉపశమనం కల్పించాలని కవర్లు, తాగునీరు తదితర సదుపాయాలను గ్రామ పంచాయతీలే సమకూర్చాలి. ఉపాధి హామీ పనుల విషయంలో చాలా బాధ్యతలు పంచాయతీలవే.
–జయరాంనాయక్, ఎంపీడీఓ, నవాబుపేట
కానరాని కనీస సౌకర్యాలు
కూలీలకు తప్పని తిప్పలు
‘ఉపాధి‘లో నీడ కరువాయె
Comments
Please login to add a commentAdd a comment