ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా
దేవరకద్ర: కొత్తగా ఏర్పడిన దేవరకద్రను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలోని బలుసుపల్లి, పెద్దగోప్లాపూర్, మీనుగోనిపల్లి, చౌదర్‌పల్లి గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై నివేదికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. మున్సిపాలిటీ సుందరీకరణకు, తాగునీటి ఎద్దడి నివారణకు, డివైడర్ నిర్మాణానికి ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం తనవంతు కృషిచేస్తానని, దీనికిగానూ కనీసం రూ.100 కోట్లు కావాలని సీఎంను కోరుతామని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి, తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీఓ శ్రీనివాసరావు, సీత్యానాయక్, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు అంజిల్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు ఫారూఖ్, నాయకులు జవహర్, నర్సింహారెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, వర్మ, రాంపాండు పాల్గొన్నారు.
మన్యంకొండలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామిని శనివారం దేవరకద్ర ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు జి.మధుసూదన్‌రెడ్డి దంపతులు దర్శించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వంశపారంపర్య ధర్మకర్త, చైర్మన్ అళహ రి మధుసూదన్‌కుమార్ ఎమ్మెల్యే దంపతులకు స్వా మివారి శేషవస్రంతో సన్మానించి ఆలయ విశిష్టతను వివరించారు. ఎమ్మెల్యే వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి ఉన్నారు.
సమస్యలు పరిష్కరించాలని వినతి
దేవరకద్ర: పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎంఈఓ బలరాం శనివారం ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి వినతిపత్రం సమర్పించారు. డోకూర్ పాఠశాలలో విద్యార్థుల కోసం డైనింగ్ హాల్ నిర్మించాలని, దేవరకద్ర జెడ్పీహెచ్‌ఎస్‌కు ప్రహరీని నిర్మించాలని ఆయన పేర్కొన్నారు. త్వరలో నిధులు మంజూర్ చేసి పనులు చేపడుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి
రామలింగేశ్వరుడి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయండి
అడ్డాకుల: కందూర్ సమీపంలో స్వయంభూగా వెలిసిన శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. శనివారంబ్రహ్మోత్సవాలకు సంబంధించిన గోడపత్రికలను ఆయన ఆవిష్కరించారు. ఈనెల 12 నుంచి ఏప్రిల్ 6 వరకు జరిగే ఉత్సవాలను విజయవంతం చేయాలని, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆలయ నిర్వాహకులకు ఎమ్మెల్యే సూచించారు. ఎమ్మెల్యే సతీమణి కవిత, ఈఓ రాజేశ్వరశర్మ, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కారెడ్డి నాగిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు తోట శ్రీహరి, రవీందర్‌శర్మ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment