మాదిగ అమరులకు నివాళి
జడ్చర్ల టౌన్: ఎస్సీ వర్గీకరణ పోరాటంలో అమరులైన వారికి స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. గాంధీభవన్, అసెంబ్లీ ముట్టడి, చలో కలెక్టరేట్ వంటి నిరసన కార్యక్రమాల్లో మృతిచెందిన వారి చిత్రపటాలను ఏర్పాటుచేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా అ ధ్యక్షుడు జంగయ్య మాదిగ, నాయకులు డి.కృష్ణయ్య, కొంగళినాగరాజు పాల్గొన్నారు.
ఉద్యమాలతోనే ఏబీసీ వర్గీకరణ
మహబూబ్‌నగర్ రూరల్: ఎస్సీ వర్గీకరణ సాధన కోసం 30 ఏళ్లుగా మాదిగ, మాదిగ ఉపకులాల ప్రజలు అనేక ఉద్యమాలతో ఏబీసీ వర్గీకరణ అమలైందని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలరాజు, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నర్సింహులు అన్నారు. తెలంగాణ చౌరస్తాలో మాదిగ అమరవీరుల చిత్రపటాలకు టీఎమ్మార్పీఎస్, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో శనివారం వేర్వేరుగా ఘనంగా నివాళులర్పించారు. నాయకులు వెంకటస్వామి, గండి బాలరాజు, వెంకటయ్య, చెన్నకేశవులు, రమేష్, నర్సిములు, కృష్ణ పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కావలి కృష్ణయ్య ఆధ్వర్యంలో మాదిగ అమరవీరులకు ఘన నివాళులర్పించగా నాయకులు పాల్గొన్నారు.
త్యాగాలు మరువలేనివి..
దేవరకద్ర: ఎస్సీ వర్గీకరణ కోసం అసువులు బాసిన అమరుల త్యాగాలు మరువలేనివని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు దొబ్బలి ఆంజనేయులు అన్నారు. స్థానిక అంబేడ్కర్‌నగర్‌లో మాదిగ అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వర్గీకరణ కోసం మూడు దశాబ్దాలుగా పోరాడి అదే మార్గంలో అమరులైన మాదిగ సోదరులను గుర్తు చేసుకుందామన్నారు. నాయకులు చెన్నప్ప, రామస్వామి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
అమరుల త్యాగం వృథా కాదు
మిడ్జిల్: మాదిగ దండోరా అమరుల త్యాగం వృథా కాదని, వారి లక్ష్యం నెరవేరే రోజులు దగ్గరలో ఉన్నాయని దండోరా జిల్లా నాయకుడు, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి టైగర్ జంగయ్య సూచించారు. శనివారం మండల కేంద్రంలో జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్ మాదిగ అధ్యక్షతన జరిగిన అమరుల సంస్మరణ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. బాలయ్య, గణేష్, బుచ్చయ్య, రవీంద్ర, చందు, మహేష్, రాజు పాల్గొన్నారు.
భూత్పూర్ చౌరస్తాలో..
భూత్పూర్: ఎమ్మార్పీఎస్ ఉద్యమ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి భూత్పూర్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. నాయకులు గడ్డం యాదయ్య, రాములు, మండి అంజి, జగన్ యాదయ వీరస్వామి, పవన్ కళ్యాణ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment