ఆకట్టుకున్న సైన్స్ ఫెయిర్
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రం శివారులోని మౌంట్ బాసిల్ హైస్కూల్ (ఎంబీహెచ్‌ఎస్)లో విద్యార్థులు విభిన్న అంశాలపై మొత్తం 354 ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఇవి ముఖ్యంగా ఆధునిక సమాజంలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా, విపత్కర పరిస్థితులలో ప్రమాదం నుంచి ఎలా బయట పడాలి, ప్రకృతి వనరులను ఎలా కాపాడుకోవాలి వంటి ఎన్నో విషయాలు అందరికీ అవగాహన కలిగించేలా ఉన్నందున ఆహూతులను ఆకట్టుకున్నాయి. అంతకుముందు గణిత శాస్త్రవేత్త సీవీ రామన్ చిత్రపటానికి మహబూబ్‌నగర్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ) వాసుదేవమూర్తి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఈ ప్రాజెక్టులను తిలకించి ఎంతో బాగున్నాయని ఆయన కితాబునిచ్చారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ చంద్రకళావెంకటయ్య, కరెస్పాండెంట్ పూజితామోహన్‌రెడ్డి, డైరెక్టర్లు శిరీష ప్రవీణ్‌కుమార్, సుశాంత్ కృష్ణ, ప్రిన్సిపాల్ సోమశేఖర్‌తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రకరకాల ప్రదర్శనలు
అడ్డాకుల: మండల కేంద్రంలోని అడ్డాకుల గ్రామర్ స్కూల్‌లో శనివారం ఏర్పాటుచేసిన సైన్స్ ఫెయిర్ ఆకట్టుకుంది. రకరకాల ప్రదర్శనలను విద్యార్థులు నిర్వహించారు. ఎంఈఓ వి.కురుమూర్తి, జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం జ్యోతి సైన్స్ ఫెయిర్‌ను సందర్శించారు. కరస్పాండెంట్ గోవర్ధన్‌చారి ఉన్నారు.
విద్యార్థులకు అభినందనలు
నవాబుపేట: స్థానిక ప్రాథమిక, సిద్ధార్థ పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ ఆకట్టుకుంది. చిన్నారు లు ఏర్పాటుచేసిన సోలార్ సిస్టం, రోడ్డు సేఫ్టీ వాటిని చూసి పలువురు విద్యార్థులను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment