బీసీల గురించి మాట్లాడే హక్కు కవితకు లేదు
స్టేషన్ మహబూబ్‌నగర్: బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎమ్మెల్సీ కవితకు లేదని బీసీ సమా జ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌సాగర్ అ న్నారు. స్థానిక బీసీ సమాజ్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడూ గుర్తుకు రాని బీసీలు ఈ రోజు గుర్తుకు వస్తున్నారని అన్నారు. అధికారానికి దూరమై ఏడాది గడిచిందని, మళ్లీ అధికారంలోకి రావడానికి బీసీల బాట పట్టడం సిగ్గుచేటన్నారు. బీసీల రాజ్యాధికారం, రిజర్వేషన్ల గురించి పోరాడేందుకు రాష్ట్రంలో చాలా మంది బీసీ మేధావులు, బీసీ రాజకీయ, విద్యార్థి, ప్రజాసంఘాల నాయ కులు ఉన్నారని, మీరు అధికారం కోసం బీసీ వా దాన్ని ఉపయోగించుకోవాలని చూడడాన్ని బీసీ సమాజ్ పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. వివిధ సంఘాల నాయకులు సారంగి లక్ష్మికాంత్, అశ్వి ని సత్యం, సత్యనారాయణ సాగర్, బి.శేఖర్, విశ్వనాథం పాల్గొన్నారు.
తీన్మార్ మల్లన్న సస్పెన్షన్‌పై..
కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను పార్టీ సస్పెండ్ చేయడాన్ని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌సాగర్ ఒక ప్రకటనలో ఖండించారు. బీసీ భావజాల వ్యాప్తికి అహర్నిశలు శ్రమిస్తున్న బీసీ గొంతుకై న తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడంతో కాంగ్రెస్ పార్టీ తన గోతిని తీసుకున్నట్లయిందన్నారు. భవిష్యత్తులో తీన్మార్ మల్లన్న తీసుకునే నిర్ణయానికి బీసీ సమాజం మొత్తం కట్టుబడి ఉంటుందని ఆయన తెలిపారు.
అసైన్డ్ భూమిని
స్వాధీనపర్చుకోవాలి
జడ్చర్ల: పట్టణ శివారులోని సర్వేనంబర్ 138లో గల అసైన్డ్ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీన పర్చుకోవాలని రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం మాజీ కార్యదర్శి ప్రణీల్‌చందర్ శనివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. సర్వేనంబర్ 138లో గల తన పట్టా భూమిని 1965లో అప్ప టి ఎమ్మెల్యే కొత్తకేశవులు భూదాన్‌యజ్ఞ బోర్డుకు స్వాధీనపర్చగా అప్పటి ప్రభుత్వం సదరుఅసైన్డ్ భూమిని కావేరమ్మపేటకు చెందిన భూమి లేని నిరుపేదలకు కేటాయించిందని ఆయన పేర్కొన్నారు. సదరు అసైన్డ్ భూమిని రెవె న్యూ అధికారులు స్వాధీనం చేసుకొని ప్రజా ప్రయోజనాలకు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment