ఉపాధి పనులపై బహిరంగ విచారణ
మహబూబ్‌నగర్ రూరల్: మండలంలోని 26 గ్రామాలలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులపై బహిరంగ విచారణ నిర్వహించారు. శనివారం మండల ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీడీఓ కరుణశ్రీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన 14వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికలో వివిధ గ్రామాల్లో జరిగిన పనులు, ఖర్చు చేసిన నిధులపై డీఆర్‌ఆర్‌పీలు, ఎస్‌ఆర్‌పీలు చదివి వినిపించారు. సామాజిక తనిఖీ 2023 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2024 మార్చి 31వ తేదీ వరకు జరిగిన పనులకు రూ. 6.70 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఉపాధిహామీ పథకంలో చేపట్టిన పనులకు గాను సామాజిక తనిఖీలో రూ. 23,927 మాత్రమే రికవరీకి అధికారులు ఆదేశించారు. ఈ సందర్భంగా జెడ్పీ డిప్యూటీ సీఈఓ ముసాయిదా బేగం మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు ఉపాధిహామీ పనులు పకడ్బందీగా గ్రామాలలో నిర్వహించబడేలా చూడాలని ఆదేశించారు. గ్రామపంచాయతీలలో చేపట్టే ఏ పనులు అయినా పంచాయతీలకే సంబంధం అని, అందువల్ల తప్పనిసరిగా బాధ్యత తీసుకొని పనులు సక్రమంగా నిర్వహించబడేలా చూడాలని అన్నారు. ఈజీఎస్ పనుల నిర్వహణ పట్ల పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. ప్రతీ గ్రామంలో కూలీలకు పనులు కల్పించే దిశగా కూలీ డబ్బులు అందించేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజావేదికలో జిల్లా విజిలెన్స్ ఆఫీసర్ ప్రేమలత, అంబుడ్స్‌మెన్ సంతోష్, ఎంపీఓ శంకర్‌నాయక్, ఈజీఎస్ ఏపీఓ రాజశేఖర్‌రెడ్డి, ఈసీ అమ్జద్, ఎస్‌ఆర్‌పీ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment