సైబర్ నేరాలతో అప్రమత్తంగా ఉండాలి
మహమ్మదాబాద్: సైబర్ నేరాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని కంచన్‌పల్లిలో సైబర్‌నేరాలపై తగిన అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సెల్‌ఫోన్‌ను తగిన జాగ్రత్తలతో వినియోగించుకోవాలన్నారు.
నిబంధనలు
అతిక్రమిస్తే చర్యలు
రాజాపూర్: ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఎస్‌ఐ శివానందంగౌడ్ అన్నారు. శనివారం మండలంలోని కుచ్చర్‌కల్‌రోడ్డులో వాహనాల తనిఖీలు నిర్వహించారు. కారులో సీటుబెల్టు తప్ప నిసరి అని, ద్విచక్రవాహనదారులు హెల్మెట్ కచ్చితంగా పెట్టుకోవాలన్నారు. లేదంటే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
సామర్థ్యాల పరిశీలన
జడ్చర్ల టౌన్: మండలంలోని ఉదండాపూర్ యూపీఎస్‌ను శనివారం ఎంఈఓ మంజులాదేవి తనిఖీచేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. 2వతరగతి విద్యార్థిని సాయిపల్లవి గణితంలో చతుర్విద ప్రక్రియలను చక్కగా చేసినందుకు అభినందించారు. పాఠశాలలో అపార్ ఐడీలు 100శాతం జనరేషన్ చేయించాలని హెచ్‌ఎం సుధాకర్‌రెడ్డికి సూచించారు. ఎఫ్‌ఎల్‌ఎన్ నిర్వహణ, సీసీఈ, ఎండీఎం పనుల నిర్వహణపై చర్చించారు. పాఠశాలలో బాలికల మరుగుదొడ్ల సమస్యగా ఉందని హెచ్‌ఎం ఆమె దృష్టికి తెచ్చారు. స్పందించిన ఎంఈఓ అధి కారుల దృష్టికి తీసుకువెళ్తానని భరోసానిచ్చారు.
సైబర్ నేరాలతో అప్రమత్తంగా ఉండాలి
Comments
Please login to add a commentAdd a comment