ఆరు‘గురి’ ఎటు..?
గద్వాల క్రైం: పట్టణంలో అర్ధరాత్రి వేళ ఓ కాలనీలో యువకుల సంచారం కలకలం రేపుతోంది. రెండు రోజుల్లో రెండుసార్లు అదే కాలనీలో ఓ రోజు ఇద్దరు, మరో రోజు ఆరుగురు రావడంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. అసలు వారి ఉద్దేశం ఏమిటోనని మదనపడుతున్నారు. ఇటీవలి జిల్లా కేంద్రంలో గుర్తుతెలియని దుండగులు పలు ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్నారు. అలాగే యువతులతో వ్యభిచార గృహాలు నిర్వహిస్తూ సంఘటనలు నిత్యం చోటు చేసుకుంటున్నాయి. ఈనేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని యువకులు రోడ్డుపై కారు పార్క్‌చేసి ఓకాలనీలో అనుమానాస్పదంగా సంచారించారు. శనివారం ఇద్దరు యువకులు చీకటి ప్రదేశంలో ఓ ఇంటి ప్రహరీని దుక్కేందుకు ప్రయత్నించగా ఆ కాలనీవాసులు పట్టుకున్నారు. జిల్లా కేంద్రంలో ఓ మెడికల్ షాపులో పనిచేస్తున్నామని, తెలిసిన వ్యక్తుల ఇంటికి వచ్చామని కాలనీవాసులకు అనుమానం కలగటంతో ఇంకోసారి ఇటువైపు తిరగొద్దని మందలించడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆదివారం తెల్లవారుజామున ఆరుగురు యువకులు కారులో వచ్చి అదే కాలనీలో అద్దెకు ఉంటున్న ఇద్దరు యువతులతో కనిపించారు. కాలనీవాసులకు అనుమానం రావడంతో యువకులను, యువతులను పట్టుకొని ప్రశ్నించారు. ఈక్రమంలో ఇదే కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నామని, ఓ కళాశాలలో చదువుతున్నట్లు ఇద్దరు యువతులు కాలనీ వాసులకు చెప్పారు. ఆ యువకులు తమగా బంధువులుగా వారు పేర్కొన్నారు. కాగా అనుమానం వచ్చిన కాలనీవాసులు పోలీసులకు సమాచారమిచ్చారు.
పొంతన లేని సమాధానం
జిల్లా కేంద్రంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని విద్యార్థినులు విద్యాభ్యాసం చేస్తున్నారు. రెండు రోజుల వ్యవధిలో వివిధ సమయాల్లో వారిని కలిసేందుకు యువకులు వస్తున్నారని కాలనీవాసులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ క్రమంలో యువకులను పోలీసులు పట్టుకొని విచారించగా వారు ఏమాత్రం పొంతన లేక సమాధానాలు చెబుతున్నారు. దీంతో అనుమానాలకు దారి తీసింది. మరో వైపు అర్ధరాత్రి వేళ రాత్రి రావడం.. కారును రోడ్డుపై పార్క్ చేయడం వంటి సంఘటనలపై పోలీసులు వాకబుచేసిన క్రమంలో ఎలాంటి సమాధానం లేకపోయింది. అయితే సంఘటన స్థలానికొచ్చిన మహిళా శిక్షణ ఎస్‌ఐ తారక ఆయువతులతో మాట్లాడారు. ఆ యువకుల పూర్తి వివరాలపై ఆరా తీశారు. యువకులకు సంబంధించిన పూర్తి వివరాలను తీసుకొని అక్కడి నుంచి పంపించి ఉదయం పట్టణ పోలీసు స్టేషన్‌కు రావల్సిందిగా ఎస్‌ఐ హెచ్చరించారు.
అయిజకు చెందినవారిగా..
అదే కాలనీ శివారులో ఇటివల 40 రోజుల క్రితం వ్యభిచార దందాపై పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు యువకులు అయిజకు చెందిన వారమని చెప్పారు. తెలిసిన వారి కోసం వస్తే అర్ధరాత్రి వేళల్లో రావడం ఏమిటి? యువతులను అపహరించడానికి వచ్చారా..? పుట్టిన రోజు శుభకాంక్షలు చెప్పడానికి వస్తే అర్ధరాత్రి రావడమేమిటి? వంటి అనుమానాలు కాలనీవాసులు వ్యక్తం చేస్తున్నారు. ఆ యువకులను పోలీసులు రెండు గంటల పాటు విచారించారు.
అర్ధరాత్రి యువకుల సంచారం
రెండు రోజుల వ్యవధిలో రెండు సార్లు
గుర్తించిన కాలనీవాసులు
ఆరా తీసిన పోలీసులు
ఆరు‘గురి’ ఎటు..?
Comments
Please login to add a commentAdd a comment