అధికారులు సమన్వయంతో పనిచేయండి
వనపర్తిటౌన్: అధికారులు సమన్వయంతో ట్రాన్స్‌ఫార్మర్ నిర్మాణపనులు చేసి త్వరగా పూర్తిచేయాలని ట్రాన్స్‌కో డైరెక్టర్ జగత్‌రెడ్డి అన్నారు. ఆదివారం కేంద్రంలోని 220/132/33 కేవీ ఉపకేంద్రం వద్ద జరుగుతున్న 3వ, 160 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2ఎక్స్ 160 ఎంవీఏ ఓవర్‌లోడ్‌తో విద్యుత్ సరఫరాలో వినియోగదారులకు కలిగే ఇబ్బందులు తొలగించేందుకు 3వ, 160 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. పెరిగిన విద్యుత్ అవసరాలను తీర్చడానికి నిరంతరాయంగా వ్యవసాయ గృహ, వ్యాపార, పరిశ్రమల వినియోగదారులకు విద్యుత్ అందించేందుకు కృషి చేస్తామన్నారు. మహబూబ్‌నగర్ ఎస్‌ఈ, ఈఈ వాసుదేవ్, ప్రకాష్, వనపర్తి డీఈ ఓఅండ్‌ఎం సైదయ్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ట్రాన్స్‌ఫార్మర్ నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలి
ట్రాన్స్‌కో డైరెక్టర్ జగత్‌రెడ్డి
3వ 16ం ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్ పనుల పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment