వేంకటేశ్వరుడి ఆశీస్సులు ప్రజలపై ఉండాలి..
వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి సీఎం చేరుకోవడంతో ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి శ్రీవెంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా వేద పండితులు సీఎం రేవంత్‌రెడ్డి గోత్రనామములతో అర్చన చేసి స్వామివారి శేషవస్త్రం, స్వామివారి చిత్రపటాలను అందజేసి వేదమంత్రోచ్ఛరణల మధ్య ఆశీర్వచనం చేశారు. సీఎంతో పాటుగా రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, శ్రీహరి స్వామివారి సేవలో గడిపారు. ఈ మేరకు మంగళహారతి దర్శనం అనంతరం ఆలయ అభివృద్ధికి రూ. కోటి నిధులతో సీఎం రేవంత్‌రెడ్డి భూమి పూజచేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అభివృద్ధికి రూ. కోటి కేటాయించామని, ఇంకా ఏమైన నిధులు అవసరమైతే అధికారులు తన దృష్టికి తేవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఆలయ ధర్మకర్త అయ్యలూరి రఘునాథచార్యులు సీఎం రేవంత్‌రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఆలయ అభివృద్ధి, ఆలయంలో జరుగుతున్న పలు క్రతువులను సీఎంకి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment