లారీ ఢీకొని మహిళ మృతి
మరికల్: లారీ ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన ఆదివారం మరికల్‌లో చోటుచేసుకున్నట్లు ఎస్‌ఐ రాము తెలిపారు. వివరాలు.. బూడ్యాగానితండాకు చెందిన అనూష(40) కొంతకాలంగా మరికల్‌లో నివాసం ఉంటుంది. తెల్లవారుజామున హైవేని దాటుతుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. తీవ్రంగా గా యపడిన ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాము తెలిపారు.
చెరువులో మునిగి వ్యక్తి..
నారాయణపేట టౌన్: పట్టణ శివారులోని కొండారెడ్డిపల్లి శివారు చెరువులో పడి ఆదివారం ఓ వ్యక్తి మృతిచెందినట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. వివరాలు.. దామరగిద్ద మండలం బాపన్‌పల్లికి చెందిన గంగారాం( 22) అనే వ్యక్తి చెరువులో విగ్రహల నిమజ్జనం సమయంలో వదిలిన ఇనుప రాడ్లు తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతిచెందాడు. మృతుడి భార్య కిష్టమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
జారిపడి యువకుడు..
కల్వకుర్తి టౌన్: నిర్మాణంలో ఉన్న భవనం మూడో అంతస్తు నుంచి జారిపడి ఓ యువ కుడు మృతిచెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా ముజ్జనూర్‌కు చెందిన ఏసు పాదం(23) ఇంటి మేసీ్త్రగా పనిచేస్తూ కల్వకుర్తిలో నివాసం ఉంటున్నాడు. విద్యానగర్ కాలనీలో ఇంటి మూడో అంతస్థులో నిర్మాణ పనులు చేస్తుండగా జారిపడ్డాడు. అక్కడ ఉన్న వారు గమనించి వెంటనే పట్టణంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు.
లారీ ఢీకొని మహిళ మృతి
Comments
Please login to add a commentAdd a comment