బల్మూర్: బొప్పాయి తోటను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసిన ఘటన మండలంలోని కొండనాగుల శివారులో సోమవారం వెలుగు చూసింది. స్థానికుల వివరాల మేరకు.. మండలంలోని మైలారం గ్రామానికి చెందిన రైతు గుండాల అనీల్ కొండనాగుల శివారులోని తన ఐదెకరాల పొలంలో ఏడాది క్రితం బొప్పాయి తోట సాగుచేశాడు. ప్రస్తుతం కోత దశలో ఉన్న తోటలోని కాయలను ఆదివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు రేగి ముళ్లతో పొడిచి నాశనం చేయడంతో రూ. 2లక్షల నష్టం వాటిల్లింది. అంతే కాకుండా తోటలో ఉన్న వ్యవసాయ బోరు స్టార్టర్ వద్ద విద్యుత్ షాక్ పెట్టి యాజమానిపై హత్యాయత్నం చేశారు. తనకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ప్రాణహాని ఉందని సోమవారం బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ రమాదేవి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment