
సరిహద్దులు దాటుతున్న బియ్యం
కృష్ణా: మండల సరిహద్దులోని చెక్‌పోస్టులో సోమవారం సాయంత్రం విజిలెన్స్ అధికారులు ఽబియ్యం లారీలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స్ డీఏస్పీ వెంకటేష్ మాట్లాడుతూ.. కొంతకాలంగా మన బియ్యం రాష్ట్ర సరిహద్దులను దాటి వెళ్తున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కమిషనర్ ఆదేశాల మేరకు తాము ఆకస్మికంగా సరిహద్దు చెక్‌పోస్టులో తనిఖీ చేశామన్నారు. ఈ తనిఖీలో వివిధ ప్రాంతాలకు చెందిన ఆరు లారీలు, ఒక డీసీఎం వ్యాన్‌లో కర్ణాటకకు వెళ్తున్న బియ్యం వాహనాలను పట్టుకున్నట్లు తెలిపారు. వాటికి సంబంధించిన సరైన పత్రాలు డ్రైవర్ల వద్ద లేకపోవడంతో లారీని సీజ్ చేసి కృష్ణా పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వాహనాల్లోని బియ్యం రైస్ మిల్లర్లవా.. అక్రమంగా తరలిస్తున్నారా అనే విషయం విచారణ అనంతరం వెల్లడిస్తామని విజిలెన్స్ అధికారులు తెలిపారు.
లారీలను సీజ్ చేసిన విజిలెన్స్ అధికారులు
Comments
Please login to add a commentAdd a comment