
ప్రభుత్వాల కుట్రలను దళితులు తిప్పికొట్టాలి
మహబూబ్‌నగర్ రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు చేస్తున్నాయని, ఆ కుట్రలు దళితులు ఏకమై తిప్పికొట్టాలని జాతీయ మాల మహానాడు రాష్ట్ర కో–ఆర్డినేటర్ బ్యాగరి వెంకటస్వామి పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక ఎస్సీ కమ్యూనిటీహాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డికి దళితుల అభివృద్ధి పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా చేవేళ్ల డిక్లరేషన్ ప్రకారం పెరిగిన దళితుల జనాభా దామాషా ప్రకారం 20 శాతానికి రిజర్వేషన్ పెంచాలని డిమాండ్ చేశారు. మాల మహానాడు ఉమ్మడి జిల్లా విస్తృతస్థాయి సమావేశం మంగళవారం అలంపూర్‌లో నిర్వహిస్తున్నామని, ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని తెలిపారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మాల ఉపకులాల ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. జిల్లాఅధ్యక్షుడు జి.చిన్న, ప్రధానకార్యదర్శి మహేందర్, నాయకులు ఆనంద్, రవికుమార్, ఆంజనేయులు, తిరుపతయ్య, రామచంద్రయ్య, వెంకట్రాములు, శ్రీనివాసులు, కె.ఆంజనేయులు, శివకుమార్ పాల్గొన్నారు.
జాతీయ మాలమహానాడు రాష్ట్ర కో–ఆర్డినేటర్ బ్యాగరి వెంకటస్వామి
Comments
Please login to add a commentAdd a comment