అలంపూర్: పట్టణంలోని సంతోష్ నగర్ కాలనీకి చెందిన రైతు బుచ్చాలు నిల్వచేసిన పశుగ్రాసం సోమవారం తెల్లవారుజామున దగ్ధమైంది. స్థానికుల వివరాల మేరకు.. రైతు బిచ్చాలు తన పశువుల పాక వద్ద వరిగడ్డి, వేరుశనగ పొట్టు, ఇతర పశుగ్రాసం నిల్వ చేయగా.. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి. స్థానికులు ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే మూడు గడ్డివాములు పూర్తిగా కాలిపోయాయి. దాదాపు రూ. 3లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయారు. విషయం తెలుసుకున్న ఆర్‌ఐ మాసుం బాషా, జూనియర్ అసిస్టెంట్ మహేందర్ అక్కడికి చేరుకొని పరిశీలించారు. ప్రభుత్వపరంగా బాధిత రైతును ఆదుకోవాలని స్థానికులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment