అరుణాచలం గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సు | - | Sakshi
Sakshi News home page

అరుణాచలం గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సు

Published Tue, Mar 4 2025 12:30 AM | Last Updated on Tue, Mar 4 2025 12:30 AM

-

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: అరుణాచలం గిరి ప్రదక్షిణకు భక్తుల సౌకర్యార్థం మహబూబ్‌నగర్‌ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక సూపర్‌ లగ్జరీ బస్సు నడుపుతున్నట్లు రీజినల్‌ మేనేజర్‌ సంతోష్‌కుమార్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక బస్సు ఈ నెల 12న రాత్రి 7 గంటలకు మహబూబ్‌నగర్‌ బస్టాండ్‌ నుంచి బయలుదేరి ఆంధ్రప్రదేశ్‌ కాణిపాకం విఘ్నేశ్వరుడు, వేలూర్‌లోని శ్రీమహాలక్ష్మి అమ్మవారి దేవాలయం దర్శనాంతరం 13న సాయంత్రం 6 గంటలకు అరుణాచలంకు చేరుకుంటుందని పేర్కొన్నారు. గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత 14వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి 15న ఉదయం మహబూబ్‌నగర్‌కు చేరుకుంటుందని వివరించారు. భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని, ఈ టూర్‌ ప్యాకేజీని సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ tsrtconline.in లో ముందస్తు రిజర్వేషన్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు. మిగతా సమాచారం కోసం 99592 26286, 94411 62588 నంబర్లను సంప్రదించాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement