పాలమూరు: ఇకపై ప్రతి చిన్న రోగానికి హైదరా బాద్‌కు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఉండదు. కార్పొరేట్ ఆస్పత్రులకే పరిమితమైన అత్యాధునిక వైద్యసేవలు త్వరలో పాలమూరులోనే అందుబాటులోకి రానున్నాయి. అన్ని హంగులతో నిర్మించనున్న నూతన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఉమ్మడి జిల్లా పేదలకు ఆరోగ్య ప్రదాయినిగా మారనుంది. ప్రతి విభాగానికి చెందిన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రధానంగా కార్డియాలజీ, న్యూరా లజీ వంటి ప్రధాన సమస్య తీరనుంది. పాత కలెక్టరేట్ ఆవరణలో ఉన్న స్థలంలో 2022 జూన్‌లో రూ.200 కోట్ల వ్యయంతో వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మొత్తం ఐదు బ్లాక్‌లుగా నిర్మించనున్నారు. ప్రస్తుతం ఏ, బీ, సీ, డీ బ్లాక్‌లు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం వీటిలో పెయిటింగ్, కరెంట్ వైరింగ్ పనులు కొనసాగుతున్నాయి. అక్కడక్క డ వాటర్ సంపు, పోస్టుమార్టం విభాగం, ఆక్సిజన్ పైప్‌లైన్, విద్యుత్ పనులు, ఎస్‌టీపీ, డ్రెయినేజీ, గ్లాస్ వర్క్, గ్రిల్స్ ఏర్పాటు చేసే పనులు చేస్తున్నా రు. ప్రధాన వైద్యసేవలు సీ–బ్లాక్‌లో నిర్మించనున్నా రు. జూన్ చివరి నాటికి సివిల్ పనులతో పాటు మైనర్ పనులను సైతం పూర్తి చేసి అధికారులకు అప్పగించే అవకాశం ఉంది. ఆస్పత్రి ప్రధాన ముఖ ద్వారం ఎల్లమ్మ గుడి వెనుక భాగంలో రావడంతో అక్కడి నుంచి రెండు లైన్ల రహదారి నిర్మిస్తున్నారు. ఆస్పత్రి చుట్టూ డివైడర్‌తో రెండు లైన్ల రహదారి నిర్మిస్తున్నారు. ఆస్పత్రికి వచ్చే వాహనాల పార్కింగ్ కోసం జెడ్పీ గ్రౌండ్ స్థలంలో నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment