రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
పెద్దకొత్తపల్లి: రోడ్డు ప్ర మాదంలో మహిళ మృతి చెందిన ఘటన దే వల తిరుమలాపూర్‌లో చోటు చేసుకున్నట్లు ఎస్‌ఐ సతీష్ తెలిపారు. వివరాలు.. పెద్దకార్పాముల గ్రామానికి చెందిన సింగిల్‌విండో వైస్ చైర్మన్ మెరుగు రాజు, అతడి భార్య అనూష, కొడుకుతో కలిసి ఆదివారం బైక్‌పై వనపర్తికి వెళ్తున్నాడు. దేవల తిరుమలాపూర్ గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయాడు. బైక్ అదుపు తప్పి అనూష రోడ్డుపై పడటంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మరణించింది. రాజుకు, అతడి కుమారుడికి గాయాలయ్యాయి. సోమవారం మృతురాలి తండ్రి ఆనంద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. బాధిత కుటుంబాన్ని మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్ గౌడ్, జూపల్లి అరుణ్ కుమార్‌రావు పరామర్శించారు.
చెరువులో పడి మహిళ..
తెలకపల్లి: చెరువులో పడి ఓ మహిళ మృతిచెందిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకున్నట్లు ఎస్‌ఐ నరేష్ తెలిపారు. వివరాలు.. తెలకపల్లికి చెందిన రెడ్డపాకుల చంద్రమ్మ (35) అనే మహిళ కొంత కాలంగా మద్యానికి బానిసైంది. కుటుంబ సభ్యులు ఎంత చెప్పి నా వినిపించుకోలేదు, తన ప్రవర్తన మార్చుకోకుండా ఎప్పుడు చనిపోతానని అంటూ ఉండేదని తెలిపారు. ఈనెల 16న గ్రామ శివారు లో ఉన్న పెద్దచెరువు దగ్గరికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడింది. ఈత రాకపోవడంతో మృతిచెందింది. మృతురాలి భర్త రెడ్డపాకుల శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
చికిత్స పొందుతూ వ్యక్తి..
జడ్చర్ల: తాగునీళ్లు అనుకొని ఫినాయిల్ తాగి వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు సీఐ కమలాకర్ తెలిపారు. వివరాలు.. మండలంలోని ఉదండాపూర్‌కి చెందిన గద్ద పెంటయ్య (62) అనే వ్యక్తి ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో బాత్‌రూంకు వెళ్లి అక్కడ తాగునీళ్లు అనుకొని బాటిల్‌లో ఉన్న ఫినాయిల్ తాగా డు. అపస్మారక స్థితికి చేరుకోగా గమనించిన కుటుంబీకులు హుటాహుటిన జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
నాగర్‌కర్నూల్ క్రైం: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాగర్‌కర్నూల్ మండలం గుడిపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ గోవర్ధన్ వివరాల మేరకు.. గుడిపల్లికి చెందిన బాలస్వామి (36) హైదరాబాద్‌లో డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడి భార్య వనిత తన సోదరి భర్త శివతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటంతో ఇద్దరి మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. ఈ క్ర మంలో మనస్థాపానికి గురైన బాలస్వామి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా మా ర్చురీకి తరలించారు. మృతుడి తండ్రి ఈశ్వరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
శతాధిక వృద్ధుడుగుజ్జుల ఆశన్న మృతి
మదనాపురం: మండలంలోని నరసింగాపురం గ్రామానికి చెందిన గుజ్జుల పెద్ద ఆశన్న(103) సోమవారం మృతిచెందారు. మొదటి పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికై మూడు పర్యాయాలు కొనసాగారు, ఐదు సార్లు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం కావడానికి కీలక పాత్ర పోషించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆయన కుటుంబానికి మాజీ సర్పంచ్ భాగమ్మ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
Comments
Please login to add a commentAdd a comment