జలాధివాసం వీడుతున్న సంగమేశ్వరాలయం
కొల్లాపూర్: సప్తనదీ సంగమ ప్రాంతంలోని సంగమేశ్వరాలయం జలాధివాసం వీడుతోంది. క్రమేణ కృష్ణానదిలో నీటిమట్టం తగ్గుతుండటంతో ఆలయం బయటపడుతోంది. సోమవారం ఆలయ ప్రాకారం పూర్తిస్థాయిలో తేలింది. ఆలయ ప్రాంగణంలో నడుము లోతు వరకు మాత్రమే నీళ్లు ఉన్నాయి. ఆలయ అర్చకులు రఘురామశర్మ గర్భగుడిలోకి వెళ్లి సంగమేశ్వరుడికి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. వారం రోజుల వ్యవధిలో నాలుగు అడుగుల మేరకు ఆలయ ప్రాంగణంలో నీటిమట్టం తగ్గింది. నీటి తగ్గింపు ఇలాగే కొనసాగితే.. ఈ నెలాఖరులోగా ఆలయం పూర్తిగా నీటి నుంచి బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతం శ్రీశైలం బ్యాక్‌వాటర్ లెవెల్స్ 842 అడుగులు ఉన్నాయి.
నదిలో నుంచి బయటపడిన ఆలయ ప్రాంగణం
జలాధివాసం వీడుతున్న సంగమేశ్వరాలయం
Comments
Please login to add a commentAdd a comment