అభ్యాస దీపిక ఉపయోగకరం..
ఎన్‌సీఈఆర్టీ రూపొందించిన అభ్యాస దీపిక విషయ సామగ్రి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం. ప్రతి భావనను రెండుసార్లు క్షుణ్ణంగా చదువుకొని అర్ధం చేసుకోవాలి. అవసరమైన చోట పట్టికలు, బొమ్మలు గీసి భాగాలను తప్పకుండా రాయాలి. జత పరచడం, తప్పు వాక్యాన్ని గుర్తించడం, వరుస క్రమంలో అమర్చడం, ఫ్లో చార్టులు బొమ్మలు వంటి అంశాలపై ప్రశ్నలుంటాయి.
– ఎండీ గౌస్, బయాలజీ టీచర్, జెడ్పీహెచ్‌ఎస్, గుమ్ముక్ల
పర్యావరణం, సాంకేతికత ఆధారంగా అంశాలను దృష్టిలో ఉంచుకొని జీవశాస్త్రం(బయాలజీ) ప్రశ్నలు రూపొందిస్తారు. ముఖ్యంగా పట్టికలను నేర్చుకొని ప్రయోగాలపై పట్టు సాధిస్తే మంచి మార్కులు సాధించే అవకాశముంది. ప్రతి పాఠంలోని అంశాలు, నిర్దిష్ట శీర్షిక కింద ఇచ్చిన భావనలను, బొమ్మలు, చార్టులు, కృత్యాలను నేర్చుకోవాలి. సెక్షన్ 3 లో తప్పకుండా ప్రయోగం వస్తుంది.
అభ్యాస దీపిక ఉపయోగకరం..
Comments
Please login to add a commentAdd a comment