పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
నాగర్‌కర్నూల్ క్రైం: న్యాయం చేయాలంటూ ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జిల్లా కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ ఎదుట గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. బల్మూరు మండలం గోదల్‌కి చెందిన 14మంది రైతులకు సంబంధించిన వరి ధాన్యాన్ని నాలుగు నెలల క్రితం జిల్లా కేంద్రానికి చెందిన శ్రీనివాసులుకు గోదల్ గ్రామానికి చెందిన రవి మధ్యవర్తిగా ఉండి విక్రయించాడు. వ్యాపారి శ్రీనివాసులు రైతులకు డబ్బులు చెల్లించకపోవడంతో గురువారం జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో అతడి ఇంటి ముందు వంటావార్పు నిర్వహిస్తుండటంతో డయల్ 100కు సమాచారం రావడంతో రైతులను పోలిస్‌స్టేషన్‌కు పిలిచారు. ఈక్రమంలోనే మధ్యవర్తి రవి పోలిస్‌స్టేషన్ ఎదుట న్యాయం చేయాలంటూ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడటంతో ఎస్సై గోవర్దన్ అడ్డుకొని పోలీస్‌స్టేషన్‌లోకి తీసుకువెళ్లాడు. సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ గోవర్దన్‌ను వివరణ కోరగా బాధితులకు పోలీస్ శాఖ ద్వారా న్యాయం చేస్తామని సముదాయించి పంపించి వేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment