దొంగ రిమాండ్‌లో పోలీసుల గోప్యత
కల్వకుర్తి టౌన్: వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగను బుధవారం రిమాండ్ చేసిన పోలీసులు ఆ విషయంలో గోప్యత పాటించారు. వరుస చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లుగా కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లును అడగగా నిజమేనని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. కల్వకుర్తిలో బుధవారం తెల్లవారుజామున పెట్రోలింగ్ చేస్తుండగా పాలమూరు చౌరస్తాలో పోలీసులను చూసి ద్విచక్రవాహనదారుడు పారిపోగా పోలీసులు అనుమానం వచ్చి వెంబడించి పట్టుకున్నారు. ఇతను పాత నేరస్తుడు భాషమోని సైదులుగా గుర్తించి విచారించారు. అతను పలు నేరా లు చేసినట్లు ఒప్పుకోవడంతో అతని నుంచి 16 తులాల బంగారం, 84 తులాల వెండి, ఓ ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపై పలు స్టేషన్లలో ఇప్పటి వరకు 50కిపైగా కేసులు ఉన్నాయని, కల్వకుర్తి కోర్టులో అతనిని హాజరుపర్చగా జడ్జి రిమాండ్ విధించారని డీఎస్పీ చెప్పారు. దొంగను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ నాగార్జున, ఎస్‌ఐలు మాధవరెడ్డి, కృష్ణదేవ, క్రైం పార్టీ కానిస్టేబుళ్లు నజీర్, చిరంజీవిని అభినందించి.. రివార్డులు సైతం అందిస్తున్నట్లు తెలిపారు.
గోప్యతపై అనుమానం..?
వరుస నేరాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడు భాషమెని సైదులు రిమాండ్ విషయంలో పోలీసులు గోప్యత పాటించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర నేరాలలో దొంగలు దొరకక అతనినే రిమాండ్ చేస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. చోరీలు జరుగుతున్నా నిజమైన దొంగలను పట్టుకోలేక, వారికి ఉన్న ఒత్తిడి దృష్ట్యా పాత నేరస్తుడినే పట్టుకొని నామమాత్రంగా చోరీ అయిన సొత్తును చూయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు విడుదల చేసిన ప్రెస్‌మీట్ ఫొటోలో ఓ ఎస్‌ఐను అతికించినట్లు ఉండటంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ.. పలు రకాలుగా చర్చలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment