బెట్టింగ్‌ భూతం | - | Sakshi
Sakshi News home page

బెట్టింగ్‌ భూతం

Published Sat, Mar 22 2025 1:12 AM | Last Updated on Sat, Mar 22 2025 1:08 AM

నేటి నుంచే ఐపీఎల్‌

నిత్యం కోట్లల్లో చేతులు మారే అవకాశం

పాలమూరులో పెట్రోల్‌ వ్యాపారంచేసే వ్యక్తి పెద్ద బుకీ

అప్పులు తీర్చలేక తనువు చాలిస్తున్న యువకులు

సాంకేతిక పరిజ్ఞానం

అండగా..

ఈసారి బెట్టింగ్‌ సాంకేతికంగా దూసుకుపోతుందని సమాచారం. వాట్సప్‌లాంటి సామాజిక మాధ్యమాలతో పాటు యాప్‌లను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్‌ నిర్వాహకులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని రూ. లక్షల్లో వ్యాపార సామ్రాజ్యానికి తెరలేపుతున్నారు. గతంలో కేవలం మహానగరాలకే పరిమితమై పరిజ్ఞానాన్ని నిర్వాహకులు ఇక్కడ వాడుకుంటున్నారు. ప్రధానంగా యువతను, విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని బుకీలు దందాను కొనసాగిస్తున్నారు. వాట్సప్‌లో రూ.3వేలు వెచ్చించి ఒక లైన్‌ తీసుకుంటున్నారు. దాని ద్వారా మ్యాచ్‌ స్థితిగతులు బుకీలకు తెలుస్తుంటాయి. టాస్‌ వేసిన క్షణం నుంచి చివరి బంతి వరకు బెట్టింగ్‌ స్వరూపాలు మారుతుంటాయి.. కొందరు మ్యాచ్‌ ఒడిపోతుందనే సందర్భం కన్పిస్తుంటే ఎక్కువ రేటింగ్‌ ఇచ్చి వేరే జట్టుకు మార్చుకుంటారు. ఇలా చేయడం వల్ల నిర్వాహకులకు అధిక లాభాలు ఉంటాయి. రేటింగ్‌ ఎక్కువ ఉన్న జట్టును తీసుకుంటే రూ.10వేలకు రూ.15వేలు చెల్లించాల్సి ఉంటుంది. రాత్రి బెట్టింగ్‌లో ఒడిపోయిన వారి దగ్గర మరసటి రోజు ఉదయం ఒక వ్యక్తి వచ్చి డబ్బు తీసుకొని వెళ్లి లైన్‌లో పెడుతుంటాడు. ఇది నిత్యం జరుగుతున్న తీరు.

మహబూబ్‌నగర్‌ క్రైం: జిల్లాలో బెట్టింగ్‌ భూతం జడలు విప్పుతోంది. బెట్టింగ్‌ యాప్‌లే కాకుండా, ఐపీఎల్‌ బెట్టింగ్‌కు అలవాటుపడిన యువత లక్షల్లో నష్టపోతున్నారు. ఇటీవల బాలానగర్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు బెట్టింగ్‌ చేయడానికి సమీప బంధువు ఖాతాల్లో ఉన్న రూ.24లక్షలు దశల వారీగా ఖాతాలో నుంచి విత్‌డ్రా చేశాడు. ఈ యువకుడిపై టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. జిల్లా కేంద్రంలో జరిగిన మరో ఘటనలో లక్షల్లో అప్పులు కావడంతో ఓయువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

● పాలమూరులో బెట్టింగ్‌ లైన్‌ నడపడంలో పేరు మోసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఆన్‌లైన్‌ యాప్స్‌ ద్వారా నకిలీ అకౌంట్స్‌తో తప్పుడు సిమ్‌లు ఏర్పాటు చేసుకొని ఈ వ్యవహారం నడుపుతున్నారు. పాలమూరులో పెట్రోల్‌ వ్యాపారం చేసే ఓవ్యక్తి పెద్ద బుకీగా ఏర్పడి అందరికి లైన్‌, యాప్‌ ద్వారా బెట్టింగ్‌ నడిపిస్తున్నాడు. ద్వితీయ శ్రేణిలో కొందరు రాజకీయ రంగులో బెట్టింగ్‌ ఆడిస్తుంటే.. మరికొందరు అదే వృత్తిగా దందా కొనసాగిస్తున్నారు.

● క్రికెట్‌ బెట్టింగ్‌పై మోజుతో యువత ప్రాణాల మీదికి తెచ్చుకొంటున్నారు. శనివారం నుంచి ఐపీఎల్‌ పోటీలు మొదలవుతున్న తరుణంలో కొందరు యువకులు బెట్టింగ్‌కు సిద్ధమవుతున్నారు. జిల్లా నలుమూలలా తిష్టవేసిన కొందరు ఈతీరును శాసిస్తున్నారు. యువతను వక్రమార్గం పట్టిస్తున్నారు. చాపకింద నీరులా జిల్లాలో క్రికెట్‌ బెట్టింగ్‌ విస్తరిస్తోంది. పైకి పోలీసులు అలాంటిదేమి లేదని చెబుతున్నా మూలాలను వెతికిపట్టి అడ్డుకట్ట వేయడంలో వారి వైఫల్యం కనిపిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రహస్యంగా జిల్లా కేంద్రంలో కొందరు వ్యాపారులు, యువత పోలీసుల కళ్లు గప్పి ఈ తంతును యథేచ్చగా నడిపిస్తున్నారు. ఈ మోజులోపడి లక్షల రూపాయల్ని పొగొట్టుకున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 15ఏళ్ల బాలుడు రూ.200నుంచి మొదలు పెడుతుండగా 45ఏళ్ల వ్యక్తి రూ. వెయ్యి నుంచి రూ.1లక్ష వరకు బెట్టింగ్‌ కాస్తున్నారు. హోటళ్లు, బేకరీలు, కిరాణం, శీతల పానీయాల దుకాణాలు, పాన్‌షాప్‌, ప్రత్యేక గదులను అద్దెకు తీసుకొని బెట్టింగ్‌ ఆడుతున్నారు. కష్టం పడకుండా డబ్బులు సంపాదించొచ్చనే అత్యాశతోనే యువకులు పెడదోవ పడుతున్నారు. రూ.2వేలు కడితే నాలుగు రేట్లు అంటే రూ.8వేలు డబ్బులు వస్తాయంటూ ఆశపడుతున్నారు.

పాత వ్యక్తులపై నిఘా..

జిల్లాలో గతంలో బెట్టింగ్‌ అడుతూ పట్టుబడటంతో పాటు కేసుల్లో పట్టుబడిన వ్యక్తులపై నిఘా పెడతాం. కొత్తగా స్థావరాలు ఏర్పాటు చేసి ఏమైనా ఆడుతున్నారో పరిశీలిస్తాం. పోలీసులు ఆయా స్టేషన్‌ పరిధిలో ఉండే వారిపై తరచూ తనిఖీలు చేయిస్తాం. ఇటీవల టూటౌన్‌ పరిధిలో బెట్టింగ్‌ ఆడుతున్నట్లు అనుమానం ఉన్న కొందరు యువకులకు కౌన్సిలింగ్‌ ఇచ్చాం.

– వెంకటేశ్వర్లు, డీఎస్పీ, మహబూబ్‌నగర్‌

సెల్‌ఫోన్‌లే ఆధారం..

ఫస్ట్‌ మ్యాచ్‌కు లక్షలు

శనివారం రాత్రి చైన్నె–ముంబై జరగనున్న మొదటి మ్యాచ్‌ కోసం ముందే జిల్లాలో బెట్టింగ్‌ కోసం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ మ్యాచ్‌ కోసం ఇప్పటి నుంచే ప్రణాళిక వేస్తున్నారు. కొందరు బుకీలు మైదా నం నుంచే పరిస్థితిలను జిల్లా లో ఉండే వారికి అందజేయ డానికి అవసరం అయిన ఏర్పా ట్లు చేసుకుంటున్న సమాచారం.

ఐపీఎల్‌ బెట్టింగ్‌ను సెల్‌ఫోన్‌ ద్వారానే కొనసాగిస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు జడ్చర్ల, దేవరకద్రలో ప్రత్యేక అడ్డాల్లో ఈ వ్యవహారం సాగుతోంది. మ్యాచ్‌ ప్రారంభం కంటే ముందే పందేలు షూర్‌ అవుతున్నాయి. ఎవరు టాస్‌ గెలుస్తారు..ఎవరు బ్యాటింగ్‌ ఎంచుకుంటారు. ఎ బ్యాట్స్‌మెన్‌ ఎన్ని పరుగులు చేస్తాడు..ఏ బౌలర్‌ ఎన్ని వికెట్లు తీస్తాడు అనే అంశంతో పాటు ప్రతి బంతికి పందేం ఉంటుంది. ఇలా ఒక్కో ఆటగాడిపై వ్యక్తిగతంగానూ బెట్టింగ్‌ అధిక సంఖ్యలో సాగుతోంది. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి కోడ్‌ భాషను వాడుకలోకి తెచ్చారు. రెండ్లు జట్లు ఆడుతుంటే జట్టు సభ్యుల దుస్తుల రంగును బట్టి కోడ్‌ వాడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement