
గంజాయి సరఫరా కేసులో ఇద్దరికి పదేళ్ల జైలుశిక్ష
మహబూబ్‌నగర్ క్రైం: సిగరెట్లలో తడిపి ఉపయోగించే గంజాయి ఆయిల్ కేసులో పట్టుబడిన ఒడిశాకు చెందిన ఇద్దరు వ్యక్తులకు జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి ఒక్కొక్కరికి పదేళ్ల జైలుశిక్షతోపాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాకు చెందిన గంజాయి సప్లయ్‌దారు బోకురూప్‌రాయ్ దగ్గర అదే రాష్టంలోని ఖలీమేలా ఏరియాకు చెందిన నారోత్తమ్ రాయ్, ధర్మేంద్రకుమార్ రాయ్ అనే యువకులు కలిసి రూ.25 లక్షల విలువ చేసే గంజాయి నుంచి వెలికితీసిన 5 కిలోల హాశీష్ ఆయిల్ (ద్రవరూపంలో ఉండే గంజాయి) కొనుగోలు చేశారు. ఆ తర్వాత సదరు ఆయిల్‌ను తీసుకుని ఒడిశా నుంచి హైదరాబాద్‌కు ద్విచక్రవాహనంపై తరలిస్తుండగా మార్గమధ్యలో మహబూబ్‌నగర్ బైపాస్ దగ్గర ముందస్తు సమాచారంతో హైదరాబాద్ ఎస్‌టీఎఫ్ పోలీసులు 2024 అక్టోబర్ 3న మధ్యాహ్నం పట్టుకున్నారు. వీరు ఒడిశా నుంచి హైదరాబాద్, మహబూబ్‌నగర్, రాయిచూర్ ప్రాంతాల్లో ఉన్న గంజాయి వినియోగదారులకు గంజాయి ఆయిల్ సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలిందని, అధిక మొత్తంలో ఎండు గంజాయి నుంచి ఆయిల్ తయారు చేస్తారని నిర్ధారించారు. చిన్న పాకెట్లు, డబ్బాలలో ఆయిల్ ప్యాక్ చేసి వినియోగదారులకు విక్రయిస్తుంటారని, దీనిని కస్టమర్స్ సిగరెట్లలో డ్రాప్స్ రూపంలో వేసుకుని తాగడంతోపాటు సిగరెట్ పేపర్‌ను ఈ ఆయిల్ తడిపి తాగుతారని నిర్ధారణ అయ్యింది. సాధారణ గంజాయి కంటే పది రెట్ల మత్తు ఈ ఆయిల్ తాగే వినియోగదారులకు లభిస్తుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ఐటీ ప్రొఫెనల్స్, మెడికల్, ఉన్నత ఉద్యోగులు దీనిని వాడుతుంటారని సమాచారం. ఈ కేసు నమోదు చేసి ఎకై ్సజ్ సీఐ వీరారెడ్డి, ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి చార్జీషిట్ దాఖలు చేసి కోర్టులో సమర్పించారు. ఈ కేసు శుక్రవారం కోర్టుకు రావడంతో జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి కల్యాణ్ చక్రవర్తి కేసు వాదనలు పూర్తయిన తర్వాత నేరం రుజువు కావడంతో నారోత్తమ్ రాయ్, ధర్మేంద్రకుమార్ రాయ్‌లకు ఒక్కొక్కరికి పదేళ్ల జైలుశిక్ష రూ.లక్ష జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించకపోతే మళ్లీ అదనంగా ఒక్కొక్కరికి ఆరు నెలల జైలు కారాగార శిక్ష విధించడం జరుగుతుందని తీర్పులో వెల్లడించారు. శిక్షపడిన ఇద్దరు వ్యక్తులను ఎకై ్సజ్ పోలీసులు జిల్లా జైలుకు తరలించారు.