
కమణీయం..శ్రీనివాసుడి కల్యాణం
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రంలోని సింహగిరిలో వెలసిన శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కల్యాణోత్సవాన్ని తిలకించారు. కల్యాణ ఘట్టాలతో ఆలయాలు, పరిసర ప్రాంతాలు పులకించిపోయాయి. స్వామివారి కల్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. శ్రీలక్ష్మీనర్సింహస్వామి వారి సంపూర్ణ కటాక్షం మహబూబ్‌నగర్ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది మీ అందరి ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆలయ సుందరీకరణ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రీ, సీహెచ్ కృష్ణయ్య, భాస్కర్, సంజీవ, మల్లేష్, బలరాం తదితరులు పాల్గొన్నారు.