
నేత్రపర్వంగా
వీరభద్రుడి రథోత్సవం
వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ వీరభద్రుడి రథోత్సవం
కోయిల్‌కొండ మండలంలో ప్రసిద్ధి చెందిన శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం అర్ధరాత్రి భక్తుల కోలాటాలు, నందికోళ్ల సేవ భజనలతో స్వామివారి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నేత్రపర్వంగా సాగిన ఈ వేడుకను తిలకించేందుకు మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్, కర్ణాటక రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై తమ మొక్కులు చెల్లించుకున్నారు. రథోత్సవం అనంతరం ఆదివారం స్వామివారి దర్శనం కోసం కొండపై వేలాది మంది భక్తులు బారులుతీరారు. పలువురు రుద్రాభిషేకం చేయించారు. రాత్రి అగ్నిగుండ ప్రవేశం నిర్వహించారు. కాగా సోమవారం భద్రకాళిదేవి వీరభద్రస్వామి కల్యాణం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు తమళి విజయ్‌కుమార్‌శర్మ తెలిపారు.
– కోయిల్‌కొండ

నేత్రపర్వంగా