ముంబై: మహారాష్ట్రలోని పండర్‌పూర్‌లోగల విఠల్-రుక్మిణి ఆలయంలో శనివారం అక్షయ తృతీయ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సుమారు ఏడు వేల మామిడిపండ్లతో అందంగా అలంకరించారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాపిస్తున్న తరుణంలోనూ అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఆలయంలో అక్షయ తృతీయ వేడుకల ఏర్పాట్లు చేశారు.
పుణేకు చెందిన వినాయక్ కచ్చి అనే వ్యాపారవేత్త ఈ మామిడి పండ్లను ఆలయానికి అందించారు. మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో లభించే అల్ఫోన్సో రకపు మామిడి పండ్లను ఆలయ అలంకరణ కోసం వినియోగించారు. అనంతరం ఈ మామిడి పండ్లను కరోనా బాధితులకు పంపిణీ చేశారు. మామిడి పండ్లతో అలంకరించిన ఈ ఆలయానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
(చదవండి: కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సతవ్ కన్నుమూత)
Comments
Please login to add a commentAdd a comment