వీడిన బాలుడి హత్య మిస్టరీ
24 గంటల్లో ఛేదించిన పోలీసులు
నిందితుడికి రిమాండ్
నిర్మల్‌టౌన్: నిర్మల్‌రూరల్ మండలం చిట్యాల శివారులోని చింతల చెరువు వద్ద శుక్రవారం రాత్రి జరిగిన బాలుడి హత్య మిస్టరీ వీడింది. 24 గంట ల్లోనే పోలీసులు కేసు ఛేదించారు. జిల్లా కేంద్రంలో ని సబ్ డివిజనల్ కార్యాలయంలో ఆదివారం ఏ ర్పాటు చేసిన సమావేశంలో ఏఎస్పీ రాజేశ్ మీనా ఈమేరకు వివరాలు వెల్లడించారు.
చిట్యాల గ్రామానికి చెందిన తోకల రాజేశ్వర్‌కు హోమో సెక్స్ అలవాటు ఉంది. అదే గ్రామానికి చెందిన అడిగెల రిషి (14) గ్రామ శివారులోని కల్లుబట్టీలో పనిచేస్తున్నా డు. రోజులాగే శుక్రవారం పనికి వెళ్లాడు. తిరిగి ఇంటికి వెళ్లేక్రమంలో అర్ధరాత్రి బాలుడిపై అత్యాచారా నికి పాల్పడ్డాడు. ఈ విషయం బయట తెలిసిపోతుందని మద్యం మత్తులో బాలుడి మర్మాంగాలపై కొట్టి దారుణంగా హత్య చేశాడు.
శనివారం ఉద యం అటువైపు వెళ్లిన గ్రామస్తులు గమనించి తల్లి, పోలీసులకు సమాచారం అందించారు. ఎస్పీ జా నకీ షర్మిల, ఏఎస్పీ రాజేశ్ మీనా ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. తల్లి రాజమణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక టీంలు ఏ ర్పాటు చేశారు. ఏఎస్పీ నేతృత్వంలో జిల్లా డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీం, సాంకేతిక పరిజ్ఞానంతో నింది తుడు రాజేశ్వర్‌ను 24 గంటల్లోనే పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. ఏఎస్పీతోపాటు రూరల్ సీఐ రా మకృష్ణ, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ కృష్ణ, ఎస్సై లింబాద్రి, సందీప్, సాయికిరణ్ లను ఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment