![జల్సా](/styles/webp/s3/article_images/2025/02/16/15nrl153r-340028_mr-1739645106-0.jpg.webp?itok=eTM21tMP)
జల్సాల కోసం దొంగతనాలు
సారంగపూర్: జల్సాలకు అలవాటుపడి చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నిర్మల్ రూరల్ సీఐ ఎం.కృష్ణ, ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిర్మల్ రూరల్ మండలం భాగ్యనగర్‌కు చెందిన ముప్కాల రాకేష్‌రెడ్డి గతంలో దాబాహోటళ్లు, వైన్‌షాపుల్లో పనిచేసేవాడు. ఈక్రమంలో మద్యానికి బానిసై జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈ నెల 12న సారంగపూర్ మండలంలోని జామ్ గ్రామంలో ద్విచక్ర వాహనం అపహరించాడు. వాహన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తులో భాగంగా చించోలి(బి) ఎక్స్‌రోడ్డు వద్ద రాకేష్‌రెడ్డి చోరీ చేసిన మరోబైక్‌తో పట్టుబడ్డాడు. అతన్ని విచారించగా నిజామాబాద్ జిల్లా ముప్కాల్, నిర్మల్ జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్‌లో రెండు ద్విచక్ర వాహనాలు, జిల్లా కేంద్రంలోని ఓ మెకానిక్ షాపులో సామగ్రి దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
నిందితుడి అరెస్టు, రిమాండ్‌కు
తరలింపు
![జల్సాల కోసం దొంగతనాలు1](/gallery_images/2025/02/16/15nrl154-340028_mr-1739645106-1.jpg)
జల్సాల కోసం దొంగతనాలు
Comments
Please login to add a commentAdd a comment