పకడ్బందీగా వార్షిక పరీక్షలు
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వరకు 10వ తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీ పక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, మంచిర్యాల ఏసీపీ ప్రకా ష్, డీఈవో ఎస్.యాదయ్యలతో కలిసి 10వ తరగ తి పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 49 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, 9,189మంది రెగ్యులర్, 221మంది ఒక్కసారి అనుత్తీర్ణులైన విద్యార్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. ఈ సమావేశంలో డీపీవో వెంకటేశ్వర్‌రావు, జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ..
లక్సెట్టిపేట: మండల కేంద్రంలో నిర్మిస్తున్న ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిని కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనులు చివరి దశకు చేరాయని, త్వరలో ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. అనంతరం కేజీబీవీ, గోదావరి రోడ్డులో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్‌ను పరిశీలించారు. తహసీల్దార్ దిలీప్‌కుమార్, కమిషనర్ మారుతిప్రసాద్ పాల్గొన్నారు.
పనుల పరిశీలన
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం గుడిపేట పునరావాస కాలనీ శివారులో కేంద్రియ విద్యాలయం భవన పనులను కలెక్టర్ కుమార్‌దీపక్ మంగళవారం పరిశీలించారు. నాణ్యత, వివరాలను ఆరా తీశారు. వచ్చే విద్యాసంవత్సరాని కి నూతన భవనం సిద్ధంగా ఉంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment