ఐటీ పార్కు మంజూరుకు కృషి
బెల్లంపల్లి: బొగ్గు గనుల క్షేత్రం బెల్లంపల్లికి ఐటీ పార్కు మంజూరు చేయించడానికి కృషి చేస్తానని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం రాత్రి బెల్లంపల్లి శివారు కన్నాలలోని ఆర్‌పీ గార్డెన్స్‌లో పట్టభద్రులు, కాంగ్రెస్ శ్రేణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రితోపాటు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ ఠాకూర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఏడాదికాలంలో 57వేల ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు. ఉద్యోగాల నోటిఫికేషన్‌లో గందరగోళ పరిస్థితులకు తావులేకుండా జాబ్ క్యాలెండర్ అమలు పరుస్తున్నామని అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్నాయని, వీటిని ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బెల్లంపల్లిలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయిస్తామని, ఆయా అంశాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మంజూరుకు పాటుపడతామని అన్నారు. ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయని, ఎమ్మెల్సీ అభ్యర్థి వి.నరేందర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇందుకోసం కాంగ్రెస్ శ్రేణులు పట్టుదలతో కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్‌లు కారుకూరి రాంచందర్, మురళీధర్‌రావు, కాంగ్రెస్ నాయకులు సీహెచ్.శంకర్, ఎం.మల్లయ్య, ఎం.నర్సింగరావు, మునిమంద రమేష్, ఆర్.సంతోష్‌కుమార్, నాతరి స్వామి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డిని గెలిపించుకోవాలి
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
Comments
Please login to add a commentAdd a comment