వైద్య సేవలపై ఆరా
మంచిర్యాలటౌన్: జిల్లాలోని మంచిర్యాల ప్ర భుత్వ జనరల్ ఆసుపత్రి, మాతాశిశు ఆరోగ్య కేంద్రం, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాలు, ఆ యుష్మాన్ భవ ఆరోగ్య కేంద్రం, బస్తీ దవా ఖానాల పరిశీలనకు పీఆర్సీ పాపులేషన్ రీసె ర్చ్ సెంటర్ విశాఖపట్నం బృందం మంగళవారం జిల్లాకు చేరుకుంది. జిల్లా వైద్య, ఆరో గ్య శాఖ కార్యాలయంలో డీఎంహెచ్‌వో డాక్ట ర్ హరీశ్‌రాజ్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని హమాలీవాడ బస్తీదవాఖాన, దీపక్‌నగ ర్ అర్బన్ హెల్త్ సెంటర్, మంచిర్యాల మాతా శిశు ఆరోగ్య కేంద్రాలను పీఆర్సీ వైద్యులు రమణ, శ్రీనివాస్ పరిశీలించి వైద్య సేవలపై తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రాల బడ్జెట్, ఖర్చులు, హాజరు నమోదు, జాతీయ ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు, వ్యాధులు ప్రబలకుండా తీసుకుంటున్న చర్యలు, మందుల లభ్యతలను పరిశీలించారు. చిన్నారులకు అందిస్తున్న టీకాలు, టీహబ్ పరీక్షలపై తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీపీఎం ప్రశాంతి, మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి, ఏవో విశ్వేశ్వర్‌రెడ్డి, వెంకటసాయి, వెంకటేశ్వర్లు, కాంతారావు, సుమన్, ప్రవళిక, పద్మ, బుక్క వెంకటేశ్వర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment