
ఆర్థిక ఇబ్బందులతో ఒకరు..
మామడ: ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై సందీప్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని ఆదర్శనగర్ గ్రామానికి చెందిన బర్కుంట లక్ష్మణ్ (33) తనకున్న ఎకరం భూమిలో సాగు చేయడంతో పాటు వ్యవసాయ కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈక్రమంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో మనోవేదనకు గురయ్యాడు. శనివారం ఇంట్లోనే ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
తిర్యాణి: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని మార్కగూడ పంచాయతీ పరిధిలోని వాడిగూడకు చెందిన పర్చకి జంగు (21) శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా పెందూర్‌గూడకు చెందిన సిద్దార్థ గిన్నెదరి నుంచి పెందూర్‌గూడకు బయలుదేరాడు. సల్పాలగూడ వద్ద ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొట్టడంతో జంగుకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుని తండ్రి భుజంగరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment