
హైదరాబాద్‌లో బామ్నికే యువతి ఆత్మహత్య
లోకేశ్వరం: మండలంలోని బామ్నికే గ్రామానికి చెందిన మర్రి అంకిత (21)హైదరాబాద్‌లోని పోచారం కారిడార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హాస్టల్ గది లో శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్తులు తె లిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన మ ర్రి లక్ష్మి, రమేశ్ దంపతుల పెద్దకుమార్తె అంకిత డిగ్రీ రెండవ సంవత్సరం వరకూ చదివింది. హైదరా బా ద్‌లోని పోచారం మున్సిపాలిటీ జీడిమెట్ల హూడా కార్తి కేయ కాలనీలోని వసతి గృహంలో ఉంటూ ఎస్సీ కార్పొరేషన్ సౌ జన్యంతో కొనసాగుతున్న ఉచిత కంప్యూటర్ శిక్షణ పొందుతోంది. శుక్రవారం కడుపులో నొప్పిరావడంతో భరించలేక గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment