మైసమ్మకు పూజలు.. మొక్కులు
● భారీగా తరలివచ్చిన ఆదివాసీలు ● దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు ● తల్లిని దర్శించుకున్న ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ● నేటి దర్బార్‌తో ముగియనున్న జాతర
రామకృష్ణాపూర్: మందమర్రి మండలం బొక్కలగుట్ట శివారులోని గాంధారీ మైసమ్మ జాతరకు రెండో రోజు శనివారం భక్తులు పోటెత్తారు. సాయంత్రం సదర్ భీమన్న వద్ద దేవతామూర్తులకు ఆదివాసీ గిరిజనుల సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి దేవతామూర్తులను జాతర జరిగే గాంధారీ ఖిల్లా దిగువ భాగంలోనికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. పిల్లనగ్రోవి వాయిద్యాలు, లక్ష్మీదేవర నృత్యాలు, తప్పెటగూళ్ల ఆటపాటలతో ఆదివాసీలు దేవతామూర్తులను జాతర ప్రాంగణంలోనికి తీసుకువచ్చారు. అక్కడ దేవతామూర్తులను ఉంచి ఆదివాసీ నాయక్‌పోడ్‌ల సంప్రదాయ ఆటపాటలతో దేవతామూర్తులను ఆనందపరిచారు. అనంతరం మహిళలు ఖిల్లాపై భాగంలో కొలువుదీరిన అమ్మవారిని పవిత్ర నదీ జలాలతో శుద్ధిచేసి మైసమ్మ తల్లికి పట్నాలు వేశారు. ప్రత్యేక పూజలు చేశారు. అర్ధరాత్రి సమయంలో పెద్దపూజ నిర్వహించారు. జాతరలో పాల్గొనేందుకు ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఆదివాసీలతోపాటు పొరుగు జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు.
ఐటీడీఏ పీవో పూజలు..
గాంధారి ఖిల్లాను ఉట్నూర్ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారి ఖుష్బూ గుప్తా సందర్శించారు. ఏపీవో పీవీటీజీ పురుషోత్తం, నాయక్‌పోడ్ సంఘం ప్రతినిధులతో కలిసి అమ్మవారికి పూజలు చేశారు. మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివాసీ నాయక్‌పోడ్ సంఘం నాయకులతో జాతర జరిగే తీరు, ఖిల్లా చరిత్ర, అభివృద్ధి గురించి చర్చించారు. ప్రశాంత వాతావరణంలో జాతర జరుపుకుని అందరి సమన్వయంతో జాతరను విజయవంతం చేయాలని నాయక్‌పోడ్ సంఘ నాయకులు, ఆయా శాఖల అధికారులకు సూచించారు.
నేడు దర్బార్..
మైసమ్మ జాతరలో భాగంగా ఆదివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులు మొక్కులు చెల్లించుకున్న అనంతరం జాతర ప్రాంగణంలో ద ర్బార్ నిర్వహిస్తారు. గాంధారి మైసమ్మ జాతర విశి ష్టత, ఆదివాసీ నాయకపోడ్‌ల సమస్యలు, ఖిల్లా అ భివృద్ధి ప్రణాళికలు తదితర అంశాలపై చర్చిస్తా రు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, నాయక్‌పో డ్ సంఘం ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది.
మైసమ్మకు పూజలు.. మొక్కులు
మైసమ్మకు పూజలు.. మొక్కులు
Comments
Please login to add a commentAdd a comment