గోదావరిలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
కోటపల్లి: మండలంలోని ఎర్రాయిపేట సమీపంలోని గోదావరి నదిలో పుణ్యస్నానానికి వెళ్లి గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మహాశివరాత్రి పురస్కరించుకుని పార్‌పల్లి గ్రామానికి చెందిన రాదండి రాజేశ్ (46), కుటుంబసభ్యులతో కలిసి బుధవారం నదిలో పుణ్యస్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. ఎస్సై రాజేందర్ ఆధ్వర్యంలో గజఈతగాళ్లు పడవల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం గురువారం లభించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
మూడు ఇసుక ట్రాక్టర్లు సీజ్
ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు జైనథ్ సీఐ డి.సాయినాథ్ తెలిపారు. జైనథ్ మండలంలోని పెన్‌గంగా నది నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారంతో గురువారం ఉదయం ఏఎస్సైలు సిరాజ్, స్వామి, పోలీస్ సిబ్బందితో కలిసి లేఖర్వాడ వద్ద తనిఖీలు నిర్వహించారు. మూడు ఇసుక ట్రాక్టర్లు అక్రమంగా ఇసుక తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. సీజ్ చేసిన ట్రాక్టర్లను జైనథ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు
పేర్కొన్నారు.
గోదావరిలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
Comments
Please login to add a commentAdd a comment