కావడి పడితేనే తాగునీరు..
దహెగాం: మండలంలోని చిన్నఐనం గ్రామంలో తాగునీటి తీవ్రమైంది. మిషన్ భగీరథ పైపులైన్ సమస్య కారణంగా నీరు సరఫరా కావడం లేదు. దీంతో గ్రామంలోని మూడు వాడలకు రోజు విడిచి రోజు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. రోజురోజుకు ఎండలు తీవ్రం అవుతుండడంతో గ్రామస్తులు తాగునీటికి అల్లాడిపోతున్నారు. గ్రామానికి అర కిలోమీటరు దూరంలోని ఒర్రె నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. గురువారం గ్రామానికి చెందిన వృద్ధుడు ఏమ రాజయ్య కావడిలో బిందెలతో నీరు తెచ్చుకుంటుండగా ‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment