మంచిర్యాలక్రైం: చెక్‌బౌన్స్ కేసులో ఒకరికి ఏడాది సాధారణ జైలుశిక్ష విధిస్తూ జూనియర్ సివిల్ జడ్జి, ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కె.నిరోష గురువారం తీర్పునిచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.. సీసీసీ నస్పూర్‌కు చెందిన వొంటెల సత్యనారాయణరెడ్డి వద్ద 2017లో కరీంనగర్ జిల్లా వీణవంకకు చెందిన మ్యాకల సత్యనారాయణరెడ్డి రూ.8 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఆ సమయంలో చెక్కులు ఇచ్చాడు. ఒప్పంద ప్రకారం తీసుకున్న అప్పు చెల్లించే గడువు తీరింది. ఆ తర్వాత బ్యాంకులో చెక్కులు డిపాజిట్ చేయగా బౌన్స్ అయ్యాయి. 2019లో కోర్టులో చెక్‌బౌన్స్ కేసు వేశాడు. విచారణలో భాగంగా సాక్ష్యాదారాలు పరిశీలించి నేరం రుజువు కావడంతో మ్యాకల సత్యనారాయణరెడ్డికి ఏడాది సాధారణ జైలుశిక్షతోపాటు తీసుకున్న అప్పు రూ.8 లక్షలు చెల్లించాలని మేజిస్ట్రేట్ తీర్పునిచ్చింది.
దాడి కేసులో ఒకరికి జరిమానా
మంచిర్యాలక్రైం: పాత మంచిర్యాలకు చెందిన ఈద శ్రీనివాస్‌పై దాడి చేసిన కేసులో రావుల రాజ్‌కుమార్‌కు రూ.10వేలు జరిమానా విధిస్తూ జూనియర్ సివిల్ జడ్జి, ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కె.నిరోష గురువారం తీర్పునిచ్చింది. సీఐ ప్రమోద్‌రావ్ కథనం ప్రకారం..శ్రీనివాస్‌కు చెందిన బ్యాంకు అటాచ్డ్ ఉన్న బజాజ్ ఫైనాన్స్‌లో రాజ్‌కుమార్‌కు నెల వాయిదా పద్ధతిలో చెల్లించేందుకు రూ.30 వేల వాషింగ్ మిషన్ ఇప్పించాడు. వాయిదాలు సకాలంలో చెల్లించలేదు. 2021 జూన్ 19న డబ్బులు చెల్లించాలని అడిగినందుకు శ్రీనివాస్‌పై దాడి చేసి గాయపర్చాడు. బాధితుడి ఫిర్యాదుతో రాజ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. సాక్షాదారాలు పరిశీలించి తర్వాత నేరం రుజువుకావడంతో రాజ్‌కుమార్‌కు జరిమానా విధిస్తూ మేజిస్ట్రేట్ తీర్పునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment